వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

● మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఉదయం 46వ డివిజన్‌లో ప్రారంభమైన మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతి ప్రచారం మధ్యాహ్నానికి 44వ డివిజన్‌ వైపు ప్రచారం సాగింది. ఆమె ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలంటూ ఫ్యాన్‌ నమూనా చూపుతూ ముందుకు సాగారు. మధ్యాహ్నం 14వ డివిజన్‌ నుంచి 18వ డివిజన్‌ వరకు ప్రచారం కొనసాగింది. ఆయా డివిజన్ల పరిధిలో మహిళలు, ప్రజలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించి తమ విజయానికి సహకరించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. మేయర్‌ అభ్యర్థి లంకా జ్యోతితో పాటు ఆయా డివిజన్ల అభ్యర్థులతో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, మాజీ మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ డెప్యూటీ మేయర్‌ లంకా సూరి బాబు, పార్టీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు (సుబ్బన్న), చిటికిన నాగేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● పెడన మునిసిపాల్టీలో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి కటకం నాగకుమారి పట్టణంలోని 16, 5 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, కౌన్సిలర్‌ అభ్యర్థులు ఫాతిమున్నీసా, నల్లా నాగలక్ష్మితో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో తాను చైర్మన్‌గా ఉన్న సమయంలో పట్టణంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం ప్రజలకు వివరించారు. తమను గెలిపిస్తే పట్టణంలోని సమస్యల పరిష్కారంతో పాటు మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● ఉయ్యూరు మునిసిపాలిటీలో చైర్మన్‌ అభ్యర్థి పైడిముక్కల దివ్య మునిసిపాల్టీ పరిధిలోని 7, 32 వార్డుల్లో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తితో పాటు అభ్యర్థులు, పార్టీ నాయకులు షేక్‌ అబుల్‌ కలాం, జంపాన కొండలరావు, ఎస్‌ సురేష్‌, గడ్డం చైతన్య తదితరులు కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చి అభ్యర్థులందరినీ గెలిపించాలని చక్రవర్తితో పాటు చైర్మన్‌ అభ్యర్థి దివ్య, ఆ వార్డుల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముమ్మరంగా ఎన్నికలప్రచారం చేస్తున్న అభ్యర్థులు

ఇంటింటికీ వెళ్లి ఓటు వేసి గెలిపించాలని వినతి

అభ్యర్థులకు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న ప్రజలు

చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాలిటీల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మచిలీపట్నంలో మేయర్‌ అభ్యర్థితో పాటు పెడన, ఉయ్యూరు మునిసిపాల్టీల్లో చైర్మన్‌ అభ్యర్థులు శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. జై జగన్‌, జై జగన్‌ అన్న నినాదాలతో ప్రచారం హోరెత్తింది. ఆయా డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులకు ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు గురించి వివరిస్తూ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement