దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, జాతీయ సరస్‌ మేళాకు రాష్ట్రపతితో పాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థంగా విధులు నిర్వర్తించాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు సూచించారు. ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు విధులపై దిశా నిర్దేశం చేసేందుకు కమిషనరేట్‌లోని అధికారులతో బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఉత్సవాల సమయంలో నగరంలోని అన్ని రాజకీయ పార్టీలు, వివిధ రంగాల సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు, అన్ని రకాల యూనియన్ల నాయకులు పోలీసు బందోబస్తుకు సహకరించాలని కోరారు.

పటిష్ట భద్రత..

గత ఏడాది 18 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, ఈ సారి మరో 20 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈ సమయంలో ప్రతి అధికారి విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. అంతేకాక వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో నిఘా, అప్రమత్తత ఎంతో అవసరమని ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా పోలీసు యంత్రాంగం, సిబ్బంది అందరూ బందో బస్తు విధుల్లోనే ఉంటారని, అక్టోబర్‌ 9 నుంచి 21 వరకూ ఎలాంటి నిరసనలు, ఆందోళనలకు తావివ్వకుండా, సంస్థాగత రాజకీయ కార్యక్రమాలను, ర్యాలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ సందర్భంగా సీపీ కోరారు. డీసీపీలు కృష్ణకాంత్‌ పటేల్‌, కేజీవీ సరిత, షిరీన్‌బేగం, లక్ష్మీనారాయణ, జి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా సీపీ రాజశేఖరబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement