లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర గవర్నల్ అబ్దుల్ నజీర్‌ను బుధవారం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 26న నిర్వహించనున్న యూనివర్సిటీ రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ గురించి తెలియజేసి, చాన్స్‌లర్‌గా ఆయన అనుమతి పొందినట్లు వీసీ తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 2.60కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి సమర్పించిన కానుకలను బుధవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. మొత్తం 14 రోజులకు గాను రూ. 2,60,73,491 నగదుతో పాటు 186 గ్రాముల బంగారం, 2.605 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక యూఎస్‌ఏకు చెందిన 435 డాలర్లు, యూఏఈకి చెందిన 280 దిర్హమ్స్, టాంజెనియాకు చెందిన వెయ్యి షిలాంగ్స్, వియత్నాంకు చెందిన పది వేల డాంగ్స్, ఓమన్‌కు చెందిన బైంసాలు 400, జపాన్ యాన్‌లు వెయ్యి, ఆస్ట్రేలియా డాలర్లు 560తో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు పర్యవేక్షించారు. వీటితో పాటు గతంలో కేంద్రం రద్దు చేసిన రూ. 2వేల నోట్లు 9 లభించినట్లు అధికారులు పేర్కొన్నారు.


