బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలి

Oct 8 2026 3:54 AM | Updated on Oct 8 2026 3:54 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బాలల హక్కులను పరిరక్షిస్తూ వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ ఎన్టీఆర్‌ జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు వెంకట పద్మలత, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు కె.జి.వెంకట పద్మలత బుధవారం విజయవాడలో పర్యటించారు. పలు విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. నలంద విద్యానికేతన్‌ సిబ్బందితో మాట్లాడి ప్రతి తరగతి గదిలో చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబరు, సలహాల పెట్టే ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత ప్రజాశక్తినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, సీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాలల భిక్షాటనను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్‌ రుక్సానా సుల్తానా బేగం తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ

కమిషన్‌ సభ్యురాలు వెంకట పద్మలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement