పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

మచిలీపట్నంఅర్బన్‌: ప్రీ కన్సెప్షన్‌ అండ్‌ ప్రీ నాటల్‌ డయాగ్నోస్టిక్‌ టెక్నిక్స్‌ యాక్ట్‌ (పీసీపీఎన్‌డీటీ చట్టం) నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, చట్ట ఉద్దేశానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పి.ఎల్‌. దయాకర్‌ పేర్కొన్నారు. జిల్లాస్థాయి పీసీపీఎన్‌డీటీ చట్టం సలహా సంఘం సమావేశం శనివారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ దయాకర్‌ మాట్లాడుతూ.. స్కానింగ్‌ కేంద్రాల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ, అవసరమైన అనుమతులు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో కొత్తగా నమోదు కోసం వచ్చిన ఒక దరఖాస్తును పరిశీలించి చర్చించారు. అనుమతి పునరుద్ధరణ కోసం వచ్చిన ఆరు దరఖాస్తులను, అనుమతుల్లో సవరణ (మోడిఫికేషన్‌) కోసం వచ్చిన రెండు దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూ నైజేషన్‌ అధికారి డాక్టర్‌ కె.ప్రేమ్‌చంద్‌, గైనకాలజిస్ట్‌, పీడియాట్రీషియన్‌, రేడియాలజిస్ట్‌, జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎల్‌.వెంకటేశ్వరరావు, ఎన్‌జీవో సభ్యులు ధర్మతేజ, కె.సుశీల, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement