తక్షణమే కరువు
మండలాలు ప్రకటించాలి
ఆరెకరాల్లో పత్తి సాగు చేశాను. ఎకరాకు రూ.35 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. పూత, కాయ దశ వరకు పంటను కాపాడుకున్నా.. వర్షాలు లేకపోవడంతో పత్తి ఎండిపోతోంది. దీనికి తోడు తెగుళ్లు సోకడంతో పూత, కాయ రాలిపోయాయి. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మొత్తం రూ.2 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టాను. ఈ ఏడాది పూర్తిగా నష్టపోయాను. కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు.
– సాంబిరెడ్డి, రైతు, వీరులపాడు
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులకు కరువు సాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా గుర్తించి రూ.లక్ష కోట్ల నిధులు విడుదల చేయాలి. రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.
– కేఎస్‌ఎస్ ప్రసాద్,
రైతు సంఘం నాయకుడు


