కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

దమ్ము, ధైర్యం ఉంటే డీఎస్సీపై సీబీఐ విచారణ జరపండి రేపు శాప్‌ కార్యాలయాల వద్ద నిరసన మీడియా సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌

వైఎస్సార్‌ సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు పరిస్థితులు వస్తాయని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం అవినాష్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వైఎస్‌ జగన్‌ని తలుచుకోని రోజు లేదన్నారు. నాడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుభరోసా కేంద్రాలు, ఈ క్రాప్‌ వంటివి రైతును రాజును చేశాయన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లాలో 50 శాతం పైనే పంట వేయలేదని, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేటలో రైతులను పట్టించుకునే వారు లేరన్నారు. జిల్లాలో అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఆరోపించారు. అంతా బాగుందని అధికారులు మాట్లాడుతున్నారని, కరువు మండలాలు ప్రకటించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫీల్డ్‌కి అధికారులు, పాలకులు వెళ్లలేదని, ఎంపీ, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.

చంద్రబాబు కరువు మ్యాన్‌

చంద్రబాబును వాటర్‌ మ్యాన్‌ అని కూటమి నేతలు అంటున్నారని, కానీ ఆయన కరువు మ్యాన్‌ అని అవినాష్‌ విమర్శించారు. రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తోందన్నారు. నీరు లేక పశువులను రైతులు అమ్ముకుంటున్నారని, కరువుపై సమీక్ష సమావేశం నిర్వహించలేదన్నారు. జిల్లాలో 48.2 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ పోరాడుతోందన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కాదని, ఎల్లోనినో ప్రభావం పండిందన్నారు.

డీఎస్సీలో రోజుకో స్కామ్‌

కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో చేపట్టిన నియామకాల్లో రోజుకో స్కామ్‌ బయటకు వస్తోందని దేవినేని అవినాష్‌ అన్నారు. ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌కి పాల్పడుతోందన్నారు. డీఎస్సీ అక్రమాలపై ఈ నెల 21న శాప్‌ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డీఎస్సీలో దొంగలు దొరికిపోయారని, కూటమి ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీపై పేర్ని నాని, అంబడి రాంబాబు చర్చకు వస్తామని చెపుతున్నారని పేర్కొన్నారు. డీఎస్సీలో అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ ఈ నెల 21న నిర్వహించనున్న ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు శనివారం మాచవరం ఎస్‌ఐ యోగేష్‌ నోటీసు అందించారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని సెంట్రల్‌ ఏసీపీ పేరుతో ఆ నోటీసును అందజేశారు. ర్యాలీ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.కూటమి పార్టీలకు మద్దతుగా చేసే ర్యాలీలకు అనుమతించే పోలీసులు, ప్రతిపక్షాల ర్యాలీలపై ఉక్కుపాదం మోపడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement