వేసవి వరకు తాగునీటి సమస్య రాకూడదు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వచ్చే వేసవి వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ నీటి వృథాకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి వనరులకు అవసరమైన మేరకు రీఫిల్లింగ్ చేసుకునే విధంగా రూపొందించుకోవాలన్నారు. గ్రామీణ తాగునీటి పథకాల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరగాలన్నారు. ఎంపీడీవోలు, డీఎల్‌డీవోలు, డీఎల్‌పీవోలు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పింఛన్లకు సంబంధించి సందేహాలను ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వెల్ఫేర్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారుల ద్వారా వెంటనే నివృత్తి చేసుకుని చూసుకోవాలన్నారు. లాగిన్ సమస్యలు ఎదురైతే ఆలస్యం చేయకుండా సమాచారం అందించాలని తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, డీపీవో ఎం.ధనలక్ష్మి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
● నీటి వృథాను అరికట్టి
లీకేజీలను నివారించాలి
● కలెక్టర్ డీకే బాలాజీ
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి..
తాగునీటి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అరికట్టాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్వో ప్లాంట్లు నిరంతరం పనిచేసేలా చూడాలని, ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఆర్వో ప్లాంట్లను కూడా తనిఖీ చేసి నీటి నాణ్యతను పరిశీలించాలన్నారు.