కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం)లో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఫిర్యాదుదారులతో సావదానంగా మాట్లాడి వారి సమస్యలను ఆలకించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన.. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 55 అర్జీలు అందినట్లు ఎస్పీ తెలిపారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● గుడివాడ నుంచి జ్యోతి అనే వివాహిత వచ్చి తనకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగినట్లు చెప్పింది. అప్పటి నుంచి తన భర్త అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడంటూ వాపోయారు. తనకు న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు.
● తోట్లవల్లూరుకు చెందిన ప్రసన్న అనే బాఽధితురాలు ఎస్పీని కలిసి తన భర్త అనారోగ్యంతో మరణించినట్లు తెలిపారు. భర్త చనిపోయిన నాటి నుంచి అత్తింటివారు, ఆడపడుచు ఇంటి నుంచి బలవంతంగా బయటికి పంపించాలని చూస్తున్నారని, న్యాయం చేయమని అర్జీలో పేర్కొన్నారు.
● చల్లపల్లి నుంచి రాములు అనే వృద్ధుడు.. తనకు 82 సంవత్సరాలని తన ఇద్దరు కుమారులు తనని చూడకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని అర్జీ ఇచ్చారు.
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు


