వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రిక్షా కార్మికుడు కెనాల్‌రోడ్డులో మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వన్‌టౌన్ ప్రాంతంలో రిక్షా తొక్కుతూ జీవించే వ్యక్తి కెనాల్‌రోడ్డులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారమందించారు. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని పరిశీలించగా మృతి చెందినట్లుగా గుర్తించారు. స్థానికులు అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. అతని వయస్సు సుమారుగా 60ఏళ్లు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సిమెంట్ కలర్ ప్యాంట్, తెలుపు రంగు టీ షర్టు వేసి వేసుకొని ఉన్నట్లుగా గుర్తించారు. ఇతర గుర్తింపు ఏమీ లేకపోవటంతో గుర్తుతెలియని మృతదేహంగా, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


