న్యూస్‌రీల్
మహా పాదయాత్ర చేస్తాం..
మాజీ ఎమ్మెల్యే, పార్టీ రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ సాగునీరందించే వరకూ పోరాటం ఆపమని, ప్రభుత్వం స్పందించకపోతే రైతులను పెద్ద ఎత్తున కూడగట్టి అవనిగడ్డ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకూ మహాపాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. తొలుత సర్ ఆర్థర్ కాటన్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాల వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు. పెనమలూరు సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, సీపీఐ అనుబంధ రైతు సంఘం నేత హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ, సీపీఐ నాయకుడు రాము, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్థన్, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోవారి పూర్ణసాగర్‌తో పాటు ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏరువాక సంబరాలు ఎందుకు చేశారు?
సాగునీరు ఇవ్వలేని వారు ఏరువాక సంబరాలు ఎందుకు చేశారని, విత్తనాలు ఎందుకిచ్చారని, ఎరువుల కోసం యాప్‌లు ఎందుకు తీసుకొచ్చారని జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నారుమళ్లు పోసుకున్నవారు, ఎద పద్ధతిన సాగుచేసిన రైతులు ఏమిచేయాలో చంద్రబాబు సమాధానం చెప్పాలని హారిక డిమాండ్ చేశారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేందుకే నిరాహార దీక్షలు చేస్తున్నట్టు చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం మామిడి కాయ తింటే షుగర్ వస్తుందని, బియ్యం తింటే కేన్సర్ వస్తుందని కల్లబొల్లి కబుర్లు చెబుతోందన్నారు.
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాగు నీరు ఇచ్చే వరకూ పోరాటం ఆగదు
అవనిగడ్డ/మోపిదేవి: మొద్దునిద్ర పోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు ప్రతి రైతును కూడగట్టి.. సాగునీరిచ్చే వరకూ పోరాడతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ వార్పు వద్ద సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన నిరాహార దీక్షను పేర్ని ప్రారంభించారు.
అప్పుడు ఇచ్చారు.. ఇప్పుడెందుకు ఇవ్వరు?
పేర్ని నాని మాట్లాడుతూ కృష్ణాడెల్టాకు వర్షాభావ పరిస్థితులు రావడం కొత్తేమీ కాదని, గతంలో 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో, 2023 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చినా వరిసాగుకు నీరిచ్చారని గుర్తు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో పులిచింతలలో 30 టీఎంసీలు ఉన్నప్పుడు పట్టిసీమ నుంచి రోజూ 3వేలు క్యూసెక్కులు తీసుకొచ్చి కృష్ణాడెల్టాకు వరిసాగుకు నీరందించారని పేర్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పులిచింతలలో 29 టీఎంసీలు నిల్వ ఉండగా, పట్టిసీమ నుంచి 5,500 క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తున్నపుడు కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే శ్రీశైలంకు వరద నీరు చేరుతుందని, వారం రోజులు దాటితే మన కృష్ణానదికి వరద నీరు వస్తుందని కావాలంటే మీడియో మిత్రులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పేర్ని చెప్పారు.
అనుసంధానమంటే ఇదేనా?
గోదావరి డెల్టా నుంచి కృష్ణా డెల్టా వరకూ భూములను కొనుగోలు చేసి, పంటకాలువలు తవ్వించి లైనింగ్ నిర్మించిన రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్ని నాని అన్నారు. పట్టిసీమకు 24 మోటార్లు బిగించి కృష్ణా–గోదావరి నదులను అనుసంధానం చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని.. అయితే పంటపొలాలకు నీరివ్వకుండా ఎండగట్టడమే అనుసంధానమా అని పేర్ని ప్రశ్నించారు. గోదావరి నుంచి లక్షలాది క్యూసెక్కులు వృథాగా పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. రైతులను కన్నీరు పెట్టిన ఏ ప్రభుత్వమూ బతికి బట్టలేదని రైతులను ఏడిపిస్తే ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుందన్నారు.
రైతులు ఏమైపోవాలి..
కృష్ణాజిల్లా ఖరీఫ్‌లో వరిపంట తప్ప వేరే పంట వేయడానికి వీలులేదని గతంలో నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పారని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. జిల్లాలో 3.96లక్షల ఎకరాలు వరిసాగు ఉందని సాగునీరందించపోతే రైతాంగం ఏమైపోవాలని నాగిరెడ్డి ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావం లేదని ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడి వరదలు వస్తున్నాయని, మన రాష్ట్రంలోనూ వర్షాలు పడతాయని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణా–గోదావరి అనుసంధానం
అంటే పంటలను ఎండగట్టడమా?
గతంలో ఇలాంటి పరిస్థితులున్నా
నీళ్లు ఆగలేదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పేర్ని నాని
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి ఆధ్వర్యంలో
పులిగడ్డ వార్పు వద్ద నిరాహార దీక్ష


