● డీఎస్సీ అవకతవకలపై మంత్రి లోకేష్
బాధ్యత వహించాల్సిందే
● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
రిలే నిరాహార దీక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ శ్రేణులు గళమెత్తాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే.. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.
● తాడిగడప మునిసిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడు మరీదు వినయ్ ఆధ్వర్యంలో యనమలకుదురులో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
● గన్నవరం మూడు బొమ్మల సెంటర్‌లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనగాని సుందరచైతన్య, పల్లి వీరయ్య నేతృత్వంలో దీక్ష శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌రాణి ప్రారంభించారు.
● ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని పామర్రులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కై లే అనిల్‌కుమార్ గురువారం ప్రారంభించారు. తొలుత కై లే అనిల్‌కుమార్ నివాస గృహం వద్ద నుంచి ర్యాలీగా పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేసుకుంటూ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ శిబిరంలో దీక్షలో పాల్గొన్న వారికి పూల దండలు వేసి దీక్షను ప్రారంభించారు. నియోజకవర్గ పరిశీలకులు వేముల కొండ తిరుపతిరావు, జెడ్పీటీసీ సభ్యులు జొన్నల రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


