మచిలీపట్నంటౌన్: స్థానిక జిల్లా కోర్టు సెంటర్ సెంటర్ సమీపంలోని రైతు బజార్‌లో సోమ వారం సబ్సిడీ బియ్యం పంపిణీ కేంద్రాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్టీమ్డ్ బీపీటీ బియ్యం కిలో రూ.52, రా బియ్యం రూ.50 చొప్పున విక్రయిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులకు సబ్సిడీ బియ్యం అందజేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, డీఎస్‌ఓ జి.మోహన్‌బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, సెక్రటరీ భాస్కర్, మార్కిటింగ్ శాఖ ఏడీ నిత్యానందం, పీడీఎస్ డెప్యూటీ తహసీల్దార్ సీహెచ్.దుర్గాంజనేయులు, రైతుబజారు ఎస్టేట్ అధికారి ఎల్.బలిచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని విజువల్లీ చాలెంజ్డ్ యూత్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు కె.ఫణికుమార్‌రెడ్డి ఆరోపించారు. అవకతవకలను అరికట్టి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్ డి.కె.బాలాజీకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫణికుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవి జనల్ మెరిట్ లిస్టులో ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై అసిస్టెంట్ డైరెక్టర్, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఆ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీఓ 34 ప్రకారం లోపా లను సరిదిద్దాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని నిజాయితీ గల అధికారితో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పరిశీలించి పారదర్శకంగా నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్ర మంలో సంఘం ఉపాధ్యక్షుడు ఎ.త్రిమూర్తులు, కార్యదర్శి కె.నాగసాయి, కోశాధికారి ఎండీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ.17 లక్షల విలు వైన లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా సమర్పించారు. దొండేటి ఐశ్వర్యజ్యోతి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి 108 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కాసుల హారం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దాతలకు వేద పండితుల ఆశీర్వచనం, ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్, ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు అమ్మ చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐ.విమల సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా పనిచేసిన ఎం.ఎన్.రాణి ఉద్యోగ విరమణ చేశారు. ఆమె స్థానంలో శ్రీకాకుళం జిల్లా పీడీగా పనిచేస్తూ సెలవుపై ఉన్న ఐ.విమలను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమ వారం కలెక్టర్ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.


