వ్యసనాల నిర్మూలనతో ఆరోగ్య సమాజం | - | Sakshi
Sakshi News home page

వ్యసనాల నిర్మూలనతో ఆరోగ్య సమాజం

Aug 4 2026 1:59 AM | Updated on Aug 4 2026 1:59 AM

వ్యసనాల నిర్మూలనతో ఆరోగ్య సమాజం

చిలకలపూడి(మచిలీపట్నం): వ్యసనాల నిర్మూలనతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని కలెక్టర్‌ డి.కె.బాలాజీ పేర్కొ న్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశపు మందిరంలో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమం’ పోస్టర్‌ను జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టర్‌ సోమ వారం ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు వంటి వ్యస నాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఆరు నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ పి.నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ జి.శ్రీనివాసరావు, బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement