గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

గ్రామానికి గర్వకారణం.. చిరస్మరణీయం గుడ్లవల్లేరు: తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పోషించిన పాత్రలు కాదు.. ఆ పాత్రలకు ఆయన ఇచ్చిన ప్రాణం. యముడైనా, దుర్యోధనుడైనా, కంసుడైనా, రాజుగానైనా, రైతుగానైనా.. తెరపై కనిపించిన ప్రతిసారి ఆ పాత్రే నిజమైపోయేది. అలాంటి మహానటుడి మూలాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం అనే చిన్న గ్రామంలోనే ఉన్నాయి. కై కాల జయంతి సందర్భంగా ఆయన సినీ విజయాల కంటే, ఆయనను తీర్చిదిద్దిన కౌతవరం జ్ఞాపకాలు నేటికీ గ్రామంలో సజీవంగా నిలిచాయి. ప్రాథమిక విద్య కౌతవరంలో పూర్తిచేసిన కై కాల, హైస్కూల్‌ చదువుకోసం ప్రతిరోజూ కాలినడకన గుడ్లవల్లేరు వెళ్లేవారు. అదే పట్టుదల ఆయనను తర్వాత మద్రాసు వరకు తీసుకెళ్లింది. అక్కడ ప్రారంభమైన సినీ ప్రయాణం దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించింది. విఠలాచార్య పరిచయం చేసిన ప్రతినాయక పాత్రలు కై కాలకు కొత్త గుర్తింపునిచ్చాయి. ఆయన విలన్‌గానే కాదు.. హాస్యం, కుటుంబ కథలు, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మక చిత్రాలు.. ఏ పాత్రలోనైనా సహజత్వాన్ని చూపించి ‘నవరస నటనా సార్వభౌముడు’ బిరుదును సార్థకం చేశారు. ఎన్టీఆర్‌ను పోలిన రూపురేఖల కారణంగా పలు చిత్రాల్లో ఆయనకు డూప్‌గా నటించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మెట్టుగా చేసుకుని తర్వాత తనదైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కౌతవరాన్ని మరచిపోలేదు. మచిలీపట్నం ఎంపీగా గ్రామంలో ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారు. కొత్త ఆస్పత్రి నిర్మాణం, కౌతవరం–చేవెండ్ర రహదారి అభివృద్ధి వంటి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపి గ్రామస్తుల మన్ననలు పొందారు. ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా లిచారు. ప్రతిఒక్కరూ ఆయన్ను గుర్తు చేసుకుంటారు.

మర్రిచెట్టు నీడలో..

1935 జూలై 25న కై కాల లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు జన్మించిన సత్యనారాయణ చిన్ననాటి రోజులు సాధారణ గ్రామీణ బాలుడివే. కౌతవరం చెరువు గట్టున ఉన్న మర్రిచెట్టు కింద గంటల తరబడి స్నేహితులతో కబుర్లు చెప్పడం, చెరువులో దొరికే చేపలు ఇష్టంగా తినడం, మంచి బెల్లం–పప్పుచెక్క కోసం మిత్రులతో తిరగడం... ఇవన్నీ ఆయన బాల్యాన్ని గుర్తుచేసే మధురస్మృతులని గ్రామ పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు.

కాలినడకన చదువుకున్న బాలుడు..

కోట్లాది అభిమానుల నటుడయ్యాడు

ప్రతినాయకుడికి కొత్త నిర్వచనం

ఎన్టీఆర్‌కు డూప్‌గా.. తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు

సినిమా దాటి.. సొంత ఊరిపై మమకారం

కై కాల మరణానంతరం గ్రామస్తులు స్వచ్ఛందంగా ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జయంతి, వర్ధంతి రోజున ఆ విగ్రహం వద్ద నివాళులర్పించడం కౌతవరం ప్రజలకు ఒక ఆనవాయితీగా మారింది. ‘మా ఊరిలో పుట్టి తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానటుడు’ అని గ్రామస్తులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement