కౌన్సెలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌ ప్రారంభం

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

కౌన్సెలింగ్‌ ప్రారంభం పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి

గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్‌)లో 2026–28 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సులో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం ప్రారంభ మైంది. ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతుందని డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వినయకుమార్‌ తెలిపారు. డైట్‌ అంగలూరుకు 99 మందిని, ఏజే కాలేజ్‌ మచిలీపట్నానికి 40 సీట్లను కన్వీనర్‌ కేటాయించారని చెప్పారు. డైట్‌ అంగలూరులో తొమ్మిది మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనలో లెక్చరర్లు ప్రకాశం, రాజ్యలక్ష్మి, జూనియర్‌ అసిస్టెంట్స్‌ శ్రీనివాస్‌, దివ్యశ్రీ, ఆఫీస్‌ సిబ్బంది శేఖర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా వైద్యాధికారి శ్రావణ్‌బాబు

లబ్బీపేట(విజయవాడతూర్పు): పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు సోకకుండా చూడవచ్చని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన శుక్రవారం పలు ప్రాంతాల్లో జరిగిన ఫ్రైడే డ్రైడే తో పాటు మెగా పేరెంట్స్‌ టీచర్చ్‌ డేల్లో పాల్గొన్నారు. ముత్యాలంపాడులోని ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో శ్రావణ్‌బాబు ఆర్‌బీఎస్‌కే సేవలు, పిల్లల విద్య, ఆరోగ్యంపై చర్చించారు. సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత, నులిపురుగుల నివారణ, రక్తహీనత నివారన, టీకాలు వేయించుకోవడం, కౌమారదశ ఆరోగ్యం, అంటువ్యాధుల నివారణ ప్రాముఖ్యతపై ఆయన తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి రాజునాయక్‌, జిల్లా ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ మహేశ్వరరావు, వైద్యులు ప్రవీణ్‌కుమార్‌, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యతో పాటు నైతిక విలువలు, వృత్తి నైపుణ్యాలను విద్యార్థులు పెంచుకోవాలని కృష్ణా విశ్వ విద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ కూనా రామ్‌జీ అన్నారు. విజయవాడలోని కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ విద్య పూర్తి చేసుకున్న వారికి శుక్రవారం గ్రాడ్యుయేషన్‌ పట్టాలు అందజేశారు. ముఖ్యఅతిథి ప్రొఫెసర్‌ రాంజీ మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మరో అతిథి సిద్ధార్థ అకాడమీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్ట్రార్‌ రవిచంద్‌ మాట్లాడుతూ అధ్యయనం, పరిశోధన, వృత్తి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల కన్వీనర్‌ అరుణ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ ఎ.సునీత, జి.రమణ, కళాశాల పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement