కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తాపీ మేస్త్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణలంక గౌతమీనగర్ రెండో లైన్‌లో గొర్రెల బంగార్రాజు (48) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతను తాపీ పనికి వెళ్తుండగా భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తెలిద్దరు చదువుకుంటున్నారు. అతను ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లేవాడు. ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. 11 గంటల వరకు కుటుంబ సభ్యులందరూ సరదాగా మాట్లాడుకుని నిద్రకు ఉపక్రమించారు. అతను మాత్రం ప్రక్క బెడ్‌రూంలో పడుకుంటానని చెప్పి లోపలకు వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు నిద్ర లేచినా అతను మాత్రం లేవలేదు. తలుపు తట్టినా ఉలుకూపలుకూ లేదు. గోడకు ఉన్న రంధ్రంలో గుండా లోపలికి చూడగా ఫ్యాన్ హుక్‌కు చున్నీతో ఉరేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో లోపలికి వెళ్లి అతనిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
17న వర్చువల్‌గా స్టేషన్ ప్రారంభోత్సవం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): అమృత్ భారత్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చేసిన రాయపాడు రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ‘సెల్ఫీ విత్ స్టేషన్’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం పి.ఇ. ఎడ్విన్ మాట్లాడుతూ రాయనపాడు రైల్వేస్టేషన్‌లో జరిగిన అద్భుతమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మార్పులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటుగా భారతదేశంలో వేగంగా జరుగుతున్న రైల్వే మౌలిక సదుపాయాలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సాహించడమే ఈ ప్రచార కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ పోటీలలో పాల్గొని సెల్ఫీ తీసుకుని ఈ నెల 16లోగా విజయవాడ డివిజన్ సోషల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్, ఎక్స్‌లలో షేర్ చేసుకోవాలి లేదా ఠ్ఛీ జ్చట్ఛ ఛ్డ్చఃజఝ్చజీ .ఛిౌఝ కి మెయిల్ చేసి తమ ఎంట్రీలను పంపిచాలన్నారు. ఈ నెల 17న స్టేషన్ ప్రారంభోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.


