రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు (60) గులాబీ, తెలుపు, బ్లూ చారలు కలిగిన ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తి గ్రామంలోని సీడబ్ల్యూసీ గోదాము వద్ద నున్న బస్‌స్టాప్‌లో గత కొన్ని రోజులుగా ఉంటున్నాడని వివరాలు అడిగితే చెప్పేవాడు కాదని స్థానికులు తెలిపారు. బస్‌స్టాప్‌లో కూర్చున్న స్థితిలోనే మృతి చెందడాన్ని ఉదయం స్థానికులు గుర్తించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి గురించి ఆచూకీ తెలిసిన వారు పటమట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ 94406 27036కు సమాచారం అందించాలని సూచించారు.


