సైబర్‌ స్కామర్లతో జాగ్రత్తగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ స్కామర్లతో జాగ్రత్తగా ఉండాలి

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

సైబర్‌ క్రైం డీసీపీ కృష్ణ ప్రసన్న

కంచికచర్ల: కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, ఇతర డిజిటల్‌ పరికరాలను ఉపయోగించి ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇతరులను మోసం చేసే నేరాలను సైబర్‌ క్రైం అంటారని సైబర్‌ క్రైం డీసీపీ కే కృష్ణ ప్రసన్న పేర్కొన్నారు. కంచికచర్ల మిక్‌ కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీలో శుక్రవారం సైబర్‌క్రైంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ కుటుంబసభ్యులు, బంధువులు చిక్కుల్లో పడ్డారని చెప్పగానే భయపడవద్దని తెలిపారు. ఈజీ మనీ పథకాల స్కామ్‌లను గుర్తిస్తే సైబర్‌ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు ఏదైనా మెసేజ్‌ పంపిస్తే స్పందించే ముందు సమాచారాన్ని తెలుసుకోవాలని డీసీపీ అన్నారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని కృష్ణ ప్రసన్న అన్నారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్‌ డీసీపీ బీ లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ సీహెచ్‌ శ్రీనివాసరావు, రూరల్‌ సర్కిల్‌ సీఐ వైవీవీఎల్‌ నాయుడు, కంచికచర్ల, వీరులపాడు, ఎస్‌ఐలు పీ విశ్వనాధ్‌, జీ నాని నరేందర్‌, బీ అభిమన్యు, పోలీస్‌సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement