నేటి నుంచి ఐటీఐ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గుడివాడరూరల్: జిల్లాలోని ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 11,12 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లాకన్వీనర్, గుడివాడ కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఓ.మంజులాదేవి శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ ఉదయం 8గంటలకు ఒకటి నుంచి 210 ర్యాంకు వరకు, 12వ తేదీ ఉదయం 8గంటలకు ర్యాంకు 211 నుంచి 330 ర్యాంక్ వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి జనరల్ పూల్ వారందరికీ తమ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు వారి విద్యార్హత, కుల, ఆదాయ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్టు ఫోటోలు, ఆధార్ కార్డుతో హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు 94414 69718, 82975 74757నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
సిద్ధార్థ కళాశాలలో రేపు జాబ్‌మేళా మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఆదివారం జాజ్‌మేళాను నిర్వహిస్తున్నామని బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) సంస్థ డైరెక్టర్స్ జయ్ దేశాయ్, విశాల్ దేశాయ్ తెలిపారు. స్థానిక సిద్ధార్థ కళాశాల ఆవరణలోని గ్రంఽథాలయంలో జాబ్‌మేళాకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ జాబ్‌మేళాకు పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, ఎంబీఏతోపాటు ఇతర కోర్సులు పూర్తి చేసి, 35ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు హాజరుకావచ్చన్నారు. ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్(ఏపీఎస్‌ఎస్‌డీసీ)తో కలిసి నిర్వహించే ఈజాబ్‌మేళాలో సుమారు 120 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి శ్రీనివాసరావు, బీఎన్‌ఐ సభ్యులు పాల్గొన్నారు.
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టి వేత తహసీల్దార్, వీఆర్వో సస్పెన్షన్ ఇబ్రహీంపట్నం: మండల తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, కొటికలపూడి వీఆర్వో నరేంద్రను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ లక్ష్మీశ ఉత్తర్వులు జారీచేశారు. కొటికలపూడి గ్రామానికి చెందిన ఓ స్థలం వివాదంలో రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ను నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారనే ఆరోపణ వీరిపై ఉంది. దీంతో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిబంధనలు అతిక్రమించారు. వీరు మంజూరు చేసిన ఎన్‌ఓసీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో రెండు కుటుంబాల మధ్య వివాదాస్పదంగా ఉన్న స్థలం అక్రమరిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఈ ఏడాది మార్చిలో స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు భవానీ రాష్ట్ర ఎస్సీ కమిషన్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వీఆర్వో నరేంద్ర అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులు శుక్రవారం వారికి అందాయి.
జిల్లా కలెక్టరేట్‌లో ల్యాండ్ సెక్షన్‌లో సూపరిండింటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసమూర్తి ఇబ్రహీంపట్నం మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు సస్పెండ్ కావడంతో ఇన్‌చార్జి తహసీల్దార్‌గా శ్రీనివాసమూర్తిని కలెక్టర్ లక్ష్మీశ నియమించారు. ఈ మేరకు శ్రీనివాసమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
పామర్రు: అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం వ్యానును పామర్రు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్బంగా పామర్రు ఎస్‌ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పామర్రు–గుడివాడ రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న వెయింగ్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యాన్‌లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సంఘటనాస్థలానికి వెళ్లి వాహనాన్ని తనిఖీ చేసి అందులో 30క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ వాహనాన్ని స్వాధీనంచేసుకున్నట్లు వివరించారు. వాహనంలోని పత్రాల ఆధారంగా మంగళగిరి మండలానికి చెందిన కాగితాల శ్రీనివాసరావు, యనమలకుదురుకు చెందిన కొప్పురావూరి శ్రీనివాసరావులను విచారించగా, వారు పామర్రుకు చెందిన బొండా నాగేశ్వరరావు వద్ద నుంచి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.20 చొప్పున 60 బస్తాలు ఒక్కొక్కటి 50 కిలోలు ఉన్నవాటిని కొనుగోలు చేసినట్లు వారు అంగీకరించారన్నారు. బందరు రోడ్డులోని గంగమ్మ గుడి సమీపంలో ఉన్న అప్పారావు భవనం వద్ద పీడీఎస్ బియ్యాన్ని వాహనంలో లోడ్ చేసి నూజివీడులోని రాము కోళ్ల ఫారానికి తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా శ్రీనివాస్‌మూర్తి..