ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు దుర్మరణం

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు దుర్మరణం

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటనపై ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం యాగంటి వెంకటసాయి (20) కేదారేశ్వరపేటలోని బిగ్‌బాస్కెట్‌లో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలసి ముత్యాలంపాడు అంబేడ్కర్‌ నగర్‌ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ముత్యాలంపాడు కెనరా బ్యాంకు ఏటీఎంకు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకుని తిరిగి వస్తుండగా భగత్‌సింగ్‌ రోడ్డులోని అపోలో ఫార్మసీ వద్ద అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్ర గాయం కాగా స్థానికులు 108 వాహనంలో ఒక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఎన్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement