జి.కొండూరు: నాటు సారా తాగి పదుల సంఖ్యలో మృత్యువాత పడిన చేదు అనుభవాలను ప్రజలు ఇంకా మరిచిపోకముందే మళ్లీ నాటుసారా తయారీ వెలుగు చూసింది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీధివీధిలో బెల్టు షాపులు, అడుగడుగునా గంజాయి విక్రయాలు యువతను మత్తులోకి దింపి చిత్తు చేస్తున్నాయి. ఇప్పుడు నాటు సారా రక్కసి రూపంలో మరింత మత్తులో ముంచెత్తేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. మైలవరం ఎకై ్సజ్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో సారా తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
మైలవరం మండలంలో నాటుసారా తాగి పదుల సంఖ్యలో మృత్యువాత పడిన ఘటన తర్వాత దశాబ్ద కాలం పైబడి సారా తయారీ ఆనవాళ్లు కనిపించలేదు. తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్న పేట మండలాల్లో తయారైన నాటుసారాను అరకొరగా తరలించి మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో ఇప్పటి వరకు విక్రయించేవారు. ఇప్పుడు నేరుగా ఎక్సజ్‌శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలో వెల్వడం గ్రామ శివారులోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మోదుగుల చెరువులో తుమ్మచెట్ల మధ్యలో సారా తయారీ బట్టీని గుర్తించడం కలకలం రేపింది. ఈ ప్రదేశంలో రెండు డ్రమ్ముల్లో సారా కాసేందుకు సిద్ధంగా ఉన్న బెల్లం ఊటను ఎకై ్సజ్‌శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సారా బట్టి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది.
నాటుసారా శాశ్వతంగా నిర్మూలించామని ఎకై ్స జ్‌శాఖ అధికారులు ప్రకటనలు గుప్పించినా ఉమ్మడి కృష్ణాజిల్లాలో దశాబ్దాలుగా ఎక్కడో ఒకచోట నాటుసారా వాసన గుప్పుమంటూనే ఉంది. విస్సన్నపేట మండలంలో వేమిరెడ్డిపల్లి, చండ్రుపట్ల, తాతకుంట్ల, ఎ.కొండూరు మండలంలోని గొల్లమందల, కుమ్మరి కుంట్ల, రేపూడి తండా, గంపలగూడెం మండలంలోని అమ్మిరెడ్డిగూడెం, రెడ్డిగూడెం మండలంలో అన్నేరావుపేట, కూనపురాజుపర్వ, రెడ్డిగూడెం, శ్రీరాంపురం, రుద్రవరం వంటి గ్రామాల్లో ఎకై ్సజ్‌శాఖ అధికారులు గత ఏడాది వరకు వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు బెల్లం, తయారైన నాటుసారాను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో నాటు సారా తయారీ ఆగలేదని తెలుస్తోంది.
రూ.99కే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. చీప్ లిక్కర్‌ని మద్యం దుకాణాల నిర్వాహకులు బెల్టు షాపులకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అన్ని బ్రాండ్ల చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ రూ.160 నుంచి రూ.200 వరకు విక్రయించడంతో పేద మందుబాబుల చూపు రూ.50కే లభించే సారా ప్యాకెట్ల వైపు మళ్లిందన్న చర్చ జరుగుతోంది. పేద మందుబాబులే లక్ష్యంగా నాటు సారా తయారవుతోందన్న విమర్శలు ఉన్నాయి.
మృత్యు వేదన మరవక ముందే....
మైలవరం మండలంలో నాగులూరు తండా, కనిమెర్ల తండా, పోరాటనగర్ తండాల్లో 2011 డిసెంబర్ 31వ తేదీన రాత్రి నూతన సంవ త్సర వేడుకల్లో భాగంగా నాటుసారా తాగ డంతో పెద్ద విషాదాన్నే మిగిల్చింది. నాటుసారా రక్కసికి బలైపోయి ఈ మూడు గ్రామాలకు చెందిన 21 మంది మరణించారు. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ వెంటనే నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు దాడులు జరిపి తయారీ కేంద్రాలను ధ్వంసం చేసి, తయారీ దారులు, విక్రయదారులపై కేసులు పెట్టారు. ఆ తర్వాత మైలవరం మండలంలో నాటుసారా తయారీ ఆనవాళ్లను కనిపించలేదు. తాజాగా నాటు సారా తయారీ కేంద్రం వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
● మైలవరం ఎకై ్సజ్ స్టేషన్
సమీపంలో నాటుసారా
తయారీ కేంద్రం
● 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు
● మైలవరం మండలంలో 2011లో
నాటుసారా తాగి 21 మంది మృతి
● మళ్లీ నాటుసారా తయారీ ఆనవాళ్లతో
ఉలిక్కిపడిన స్థానిక ప్రజలు
దశాబ్ద కాలం తర్వాత...
గుప్పు మంటూనే ఉంది...
చీప్ లిక్కర్ కాస్ట్‌లీగా మారడంతో..