11వ తేదీ నుంచి ఐటీఐ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

11వ తేదీ నుంచి ఐటీఐ కౌన్సెలింగ్‌

Jul 8 2026 2:02 AM | Updated on Jul 8 2026 2:02 AM

11వ తేదీ నుంచి ఐటీఐ కౌన్సెలింగ్‌ మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 11, 12, 13వ తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా ఐటీఐ కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ ఎం.కనకారావు ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ రమేష్‌ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 11వ తేదీ ఉదయం 8 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు అవుతుందని తెలిపారు. 11వ తేదీ 10 నుంచి 6.2 గ్రేడ్‌ పాయింట్లు పొందిన వారికి, 12వ తేదీన 6.1 నుంచి 4.6 గ్రేడ్‌ పాయింట్లు, 13వ తేదీన 4.5 నుంచి 3.9 దిగువ పొందిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో పాటుగా సర్టిఫికెట్స్‌ పరిశీలన చేయించుకున్న ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులో పేర్కొన్న మొబైల్‌ నంబర్‌కు ఇప్పటికే కౌన్సెలింగ్‌ తేదిలను తెలియజేస్తూ ఎస్‌ఎంఎస్‌లను పంపామని కనకారావు తెలిపారు. వివరాలకు 0866–475575, 94906 39639,77804 29468లలో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. గుడ్లవల్లేరు పీఎస్‌కు కారు బహూకరణ గుడ్లవల్లేరు: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌) కింద గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మెయిల్‌) సంస్థ అధినేత పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి రూ.13లక్షల విలువైన కారును బహూకరించారు. మంగళవారం మచిలీపట్నంలోని మెయిల్‌ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి చేతుల మీదుగా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడుకు అందించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం ఆవరణలో బాపిరెడ్డితో కలిసి ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ప్రారంభించారు. తమ పోలీసు శాఖకు వాహన సేవ అందించిన మెయిల్‌ కృష్ణారెడ్డికి కృష్ణాజిల్లా పోలీస్‌ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బాపిరెడ్డిని జిల్లా ఎస్పీ సత్కరించారు. రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం ప్రాణం తీసిన ఈత సరదా

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం, ఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ మృతిచెందింది. దీన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటస్వామి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై బ్రౌన్‌ కలర్‌ నైటీ, ఎరుపు రంగు లంగా ధరించి, మెడలో పసుపు తాడు, సూత్రం, రోల్డ్‌ గోల్డ్‌ చెవి దిద్దులు, మట్టిగాజులు ధరించి ఉందని, కుడి చేతిపై స్వస్తిక్‌ పచ్చబొట్టు ఉందన్నారు. ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఆచూకి తెలిసిన వారు 0866–2768630, 91103 64646ల ద్వారా జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు.

కంచికచర్ల: తోటి స్నేహితులతో కలసి మునేరులో ఈతకు వెళ్లిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాళ్ల మధ్యలో చిక్కుకుని ఊపిరాడక మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి. విశ్వనాథ్‌ తెలిపిన కథనం మేరకు.. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గొట్టపు రామకృష్ణ(34) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన ఇద్దరు స్నేహితులతో కలసి మండలంలోని కీసర మునేటిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. మునేరులో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు పెద్ద బండరాళ్లు నీళ్లలో ఉండటంతో ఆ రాళ్లలో చిక్కుకుని పోయాడు. గమనించిన తోటి స్నేహితులు రామకృష్ణను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఊపిరాడక రామకృష్ణ మృతిచెందాడు. మృతునికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐవిశ్వనాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement