గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏపీ కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కఠారి ఈశ్వరరావును నియమించామని సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సొసైటీ చైర్మన్, మాజీ ఎస్పీ సీహెచ్ చక్రపాణి నివాసంలో నిర్వహించారు. చక్రపాణి చేతుల మీదుగా నియమాక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎన్నికై న ఈశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను కర్తవ్యంగా భావిస్తానన్నారు. సొసైటీ, క్రీడాభివృద్ధికి తన వంతు చేయూతనందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షురాలు కె.విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రసాద్, నాగరాజు, కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.


