వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో అవినాష్‌ పుట్టినరోజు వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో అవినాష్‌ పుట్టినరోజు వేడుకలు

Mar 16 2026 8:36 AM | Updated on Mar 16 2026 8:36 AM

వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో అవినాష్‌ పుట్టినరోజు వేడుకలు 19న అండర్‌–19 పురుషుల కృష్ణా క్రికెట్‌ జట్టు ఎంపిక 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత పెనమలూరు: రేషన్‌ బియ్యం అక్రమ రవాణా పరంపర కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులు పేదల బియ్యాన్ని బాహాటంగా తరలించుకు పోతున్నా అధికారులు నియంత్రించలేక పోతున్నారు. తాజాగా కానూరులో పోలీసులు 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరు కొత్త ఆటోగర్‌లో రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీలో రేషన్‌ బియ్యం ఉందన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లారీని స్వాధీనం చేసుకొని తనిఖీ చేయగా అందులో 200 ప్లాస్టిక్‌ బ్యాగుల్లో 100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లారీ ఓనర్‌ కం డ్రైవర్‌ బాలస్వామిని విచారణ చేయగా ఎన్టీఆర్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం కిలో రూ.18కి కొని బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్నామని తెలిపాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేఎల్‌యూలో 5వ అంతర్జాతీయ గణిత సదస్సు

లబ్బీపేట(విజయవాడతూర్పు): తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేత నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా దేవినేని అవినాష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కృష్ణాజిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–19 (పురుషుల) జట్టు ఎంపికలు ఈ నెల 19వ తేదీ నిర్వహిస్తున్నామని సంఘం కార్యదర్శి ఎం.రవీంద్ర చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ఆవరణలో సెలక్షన్స్‌ జరుగుతాయని పేర్కొన్నారు. 1.9.2007 తర్వాత జన్మించిన వారు పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, తెల్లటి దుస్తులు(వైట్‌ డ్రస్‌), స్పోర్ట్స్‌ షూ, సొంత క్రికెట్‌ కిట్‌, రెడ్‌ కలర్‌ బాల్‌తో ఈ ఎంపికలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరి మృతి

పెనమలూరు: పోరంకి వద్ద విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు సుగాలీ కాలనీకి చెందిన ఎన్‌.రాంబాబు (45) బోరింగ్‌ పనులు చేస్తాడు. అతను శనివారం అర్ధరాత్రి రసనా బార్‌ ఎదురుగా రోడ్డు దాటుతుండగా కంకిపాడు వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని కారు అతివేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టింది. ఘటనలో రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. మృతుడి కుమారుడు సాయినాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్‌ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

తాడేపల్లి రూరల్‌: వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు రోజుల పాటు అంతర్జాతీయ గణిత సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్‌ జి.పార్థసార ట వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్‌, కృత్రిమ మేధస్సు అంశంపై జరగనున్న అంతర్జాతీయ గణిత సదస్సుకు అతిథులుగా వర్సిటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ కేఎస్‌ జగన్నాథరావు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అకడమిక్స్‌ డైరెక్టర్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగ ఆచార్యులు డాక్టర్‌ వి.కామాక్షి ప్రసాద్‌ హాజరు కానున్నారని వెల్లడించారు. కార్యక్రమాన్ని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానాల్లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గణిత సదస్సులో దేశ విదేశాల నుంచి రీసోర్స్‌ పర్సన్స్‌, ఔత్సాహికులు పాల్గొని తాము రూపొందించిన పరిశోధనా పత్రాలను ప్రదర్శించనున్నారన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement