కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Mar 15 2026 4:52 AM | Updated on Mar 15 2026 4:52 AM

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్‌ సహర్‌ (ఆది) (సోమ) విజయవాడ 6.23 4.58 జగ్గయ్యపేట 6.24 5.06 మచిలీపట్నం 6.21 4.56 –8లోu దుర్గమ్మకు పలువురు విరాళాలు

జిల్లాలో గ్యాస్‌ కంపెనీల వద్ద బారులు తీరుతున్న వినియోగదారులు బుక్‌ చేసి వారమైనా సరఫరా చేయని వైనం గ్యాస్‌ దొరకదనే భయంతో కంపెనీలకు వచ్చి తీసుకెళ్తున్న ప్రజలు పట్టించుకోని సివిల్‌ సప్లయి శాఖ అధికారులు

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026

రేపు ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను అధికారులకు అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన నిమ్మగడ్డ సత్యనారాయణ కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్‌ మల్కాజ్‌గిరికి ృచెందిన ఎస్‌. సంధ్యారాణి కుటుంబం అమ్మవారి గోసంరక్షణ పథకానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అధికారులు చందు శ్రీనివాస్‌, డీవీవీ సత్యనారాయణలు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 16వ తేదీ నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌ విందు వేదిక మార్పు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. ముందుగా నిర్ణయించిన విధంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో కాకుండా ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి సంబంధించిన వేదిక మార్పు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇఫ్తార్‌ విందులో పాల్గొనే మత పెద్దలు, ముస్లింలు, ప్రజాప్రతినిధులు వేదిక మార్పును అంశాన్ని గమనించాలన్నారు. ఇఫ్తార్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ లక్ష్మీశ అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, వసతులు, ట్రాఫిక్‌ వంటి విషయాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఏపీ వక్ఫ్‌ బోర్డ్‌ సీఈవో యాకూబ్‌ బాషా, విజయవాడ ఆర్డీవో టి.వి.సతీష్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్‌ రబ్బాని, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌ టి.మోహన్‌రావు, వక్ఫ్‌ బోర్డు అధికారులు ఆదం షఫీ, మస్తాన్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంటౌన్‌: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌ సరఫరాకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నా.. వినియోగదారుల్లో దొరకదనే భయం ఉంది. అమెరికా, ఇజ్రాయిల్‌–ఇరాన్‌ యుద్ధ ప్రభావంతో మచిలీపట్నం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్ల సమస్య జటిలమవుతోంది. గ్యాస్‌ సిలిండర్‌పై మచిలీపట్నం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో చర్చ జరుగుతోంది. సిలిండర్ల కోసం వినియోగదారులు వారి వాహనాలకు గ్యాస్‌ బండలను కట్టుకొని లేదా ఆటోలో వేసుకుని, మోసుకుంటూ కంపెనీలకు చేరుకుంటున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్‌లను బ్లాక్‌లో వేలాది రూపాయలకు అమ్ముకుంటూ గ్యాస్‌ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఏజెన్సీల బాట

ఓ వైపు డొమెస్టిక్‌ గ్యాస్‌ సరఫరా సజావుగానే జరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా మచిలీపట్నంలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. నాలుగు రోజుల నుంచి నగరంలోని గ్యాస్‌ కంపెనీల వద్ద వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఏజెన్సీల నిర్వాహకులు డోర్‌ డెలివరీ చేయకపోవడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళనతో ఏజెన్సీల బాట పడుతున్నారు. గ్యాస్‌ లోడు ఆటోలను డెలివరీకి పంపకుండా కంపెనీల వద్దే ఉంచుతున్నారు. బందరు సుకర్లాబాదులో ఉన్న ఇండియన్‌ గ్యాస్‌ కంపెనీ వద్ద శనివారం నిండు గ్యాస్‌ సిలిండర్లతో ఉన్న నాలుగు ఆటోలు నిలిపి ఉన్నాయి. నగరంలోని భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉండడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్‌ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాల్సిన సివిల్‌ సప్లయి అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సివిల్‌ సప్లయి అధికారులు దృష్టి సారించి గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు డోర్‌ డెలివరీ అయ్యేలా చూడాలని వారు కోరుతున్నారు.

7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement