చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,09,105 కేసులను పరిష్కరించినట్లు ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 బెంచ్‌లను ఏర్పాటు చేసి ఈ కేసులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిల్లో 96,999 క్రిమినల్ కేసులు, 394 సివిల్ కేసులు, 886 చెక్కు బౌన్స్ కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. 124 మోటారు వాహన ప్రమాదాలకు గాను రూ.20.08 కోట్లు నష్టపరిహారం అందించడానికి ఇన్సూరెన్సు కంపెనీలు అంగీకరించాయన్నారు. 10,702 కేసులు ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించి అవార్డులను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, పలువురు న్యాయ మూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


