విజయవాడరూరల్: నున్న విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో రెండు రోజులపాటు నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీ బుధ వారం ముగిసింది. విజయవాడకు చెందిన కేబీఎన్ కళాశాల జట్టు విజేతగా నిలిచింది. విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు ద్వితీయస్థానాన్ని దక్కించుకుంది. మైలవరానికి చెందిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మూడో స్థానంలో, విజయవాడకు చెందిన పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. నాకౌట్–కమ్–లీగ్ విధా నంలో జరిగిన ఈ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అనేక కళాశాలల జట్లు పాల్గొన్నాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాం డెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా యూనివర్సిటీ పురుషుల హ్యాండ్‌బాల్ జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్ కుమార్, సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నే స్వామి, డి.హేమచంద్రరావు, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.


