మొక్కజొన్న చేలో రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న చేలో రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 11 2026 9:19 AM | Updated on Mar 11 2026 9:19 AM

మొక్కజొన్న చేలో రేషన్‌ బియ్యం పట్టివేత గంపలగూడెం: పేదల బియ్యాన్ని కోళ్ల ఫారాలకు తరలించేందుకు మొక్కజొన్న చేలల్లో నిల్వ చేశారన్న సమాచారంతో రెవెన్యూ, పీడీఎస్‌ అధికారులు మంగళవారం దాడి చేశారు. మండలంలోని దుందిరాలపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు తునికిపాడులో కోళ్ల మేత కోసం మొక్కజొన్న చేలో నిల్వ చేసినట్లు చెప్పారు. 150 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాఽధీనం చేసుకుని సెక్షన్‌ 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ దాడిలో తహసీల్దార్‌ వి. విజయకుమారి, డీటీ నాగరాజులు ఉన్నారు. కార్మికుల భద్రత యాజమాన్యాల బాధ్యత దర్మవరప్పాడుతండ(జగ్గయ్యపేట): కర్మాగారాలలో పని చేసే కార్మికులకు యాజమాన్యాలు తగిన భద్రత కల్పించాలని ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉషశ్రీ పేర్కొన్నారు. గ్రామంలోని రామ్‌కో సిమెంట్‌ కర్మాగారంలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్మాగారాలలోని కార్మికులకు భద్రతా నియమాల ప్రకారం వారికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వారోత్సవాల సందర్భంలోనే కాకుండా ప్రతిరోజు కార్మికులకు భద్రతా నియమాలపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రాజు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. బార్‌లో బీర్‌ సీసాతో దాడి

ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జాయింట్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉషశ్రీ

పెనమలూరు: బార్‌లో జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి బీర్‌ సీసాతో దాడి చేసి గాయపరిచిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురుకు చెందిన కంచరపల్లి కామేష్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కామేష్‌ యనమలకుదురులో బార్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న వెంకట్‌, చలమలశెట్టి పవన్‌ పాత కక్షల కారణంగా కామేష్‌తో గొడవపడ్డారు. దీంతో వెంకట్‌ బీరు సీసాతో కామేష్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో కామేష్‌కు బీర్‌ సీసా మెడ వద్ద గుచ్చుకుని గాయమైంది. గాయపడిన కామేష్‌ను విజయవాడ ప్రభుత్వస్పత్రిలో చికిత్సకు చేర్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement