కమ్మేసిన ముసురు! | - | Sakshi
Sakshi News home page

కమ్మేసిన ముసురు!

Aug 29 2025 7:12 AM | Updated on Aug 29 2025 7:12 AM

కమ్మే

కమ్మేసిన ముసురు!

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు 36.9 మి.మీ. వర్షపాతం.. పొంచి ఉన్న వ్యాధుల భయం.. ఉద్యాన రైతుల్లో ఆందోళన..

అధ్వానంగా మారిన పరిసరాలు పొంచి ఉన్న వ్యాధుల భయంతో వణుకుతున్న జనం వరి పంటకు జీవం పోసిన వర్షం ఆందోళనలో ఉద్యాన పంటల రైతులు

వరిపైరుకు జీవం..

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

కంకిపాడు: వుుసురు పట్టింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముసురు కారణంగా ఎడతెరపిలేకుండా చిరు జల్లులు కురుస్తున్నాయి. వర్షంతో ఎక్కడ చూసినా వర్షపునీరు నిలిచిపోవటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వర్షం వరి పంటకు జీవం పోసిందని అన్నదాతలు చెబుతున్నారు. ఉద్యాన పంటల రైతులు మాత్రం ఒకింత ఆందోళన చెందుతున్నారు.

కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8.30 గంటల సమయానికి సగటున 24.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నందివాడలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా అవనిగడ్డలో 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం 8.30 నాటికి 36.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోడూరులో 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా నందివాడలో 16.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుడివాడ 58.6, పెనమలూరు 55.0, ఘంటసాల 51.6, కంకిపాడు 49.2, బంటుమిల్లి 48.2, కృత్తివెన్ను 42.6, ఉయ్యూరు 41.6, గుడ్లవల్లేరు 38.8, చల్లపల్లి, గన్నవరం, మోపిదేవి 38.4, గూడూరు 38.2, నాగాయలంక 37.6, పెడన 35.6, పమిడిముక్కల 34.6, పెద పారుపూడి 33.2, బాపులపాడు 30.6, ఉంగుటూరు 26.8, పామర్రు 26.4, మొవ్వ 26.2, తోట్లవల్లూరు 24.4, మచిలీపట్నం నార్త్‌ 23.6, మచిలీపట్నం సౌత్‌ 23.6, అవనిగడ్డ 18.6 మిల్లీమీటర్లు నమోదైంది.

మోస్తరు వర్షంతో పరిసరాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. రహదారుల గోతుల్లో నీరు చేరటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పరిసరాలు అధ్వానంగా మారటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల జ్వరాలు, దగ్గు, జలుబులతో ప్రజలు రోగాల బారిన పడ్డారు. ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముసురు పట్టడంతో పరిసరాలు మురుగెత్తుతున్నాయి. దీని కారణంగా వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. వ్యాధుల భయంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై వ్యాధులు విజృంభించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ముసురు పట్టి రెండు రోజులు పాటు విడవకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఉద్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పసుపు పంట పొలాల్లో నీరు నిలిచిపోయి పంటకు దుంప కుళ్లు తెగులు ఆశిస్తుందనే భయం రైతులను వెంటాడుతోంది. పొలాల్లో ఉన్న మురుగునీటిని బయటకు మళ్లించి పంటను సంరక్షించుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.

ఈ వర్షంతో వరి పైరుకు మేలు చేస్తుందని రైతులు అంటున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.51లక్షలకు పైగా హెక్టార్లలో వరి సాగు జరిగింది. దివిసీమ ప్రాంతంలో నాట్లు పూర్తయ్యి 15–20 రోజులు గడుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో వరి పైర్లు దుబ్బు దశలో ఉన్నాయి. ఈ తరుణంలో వరి పంటకు వర్షం జీవం పోసినట్లేనని, పైరు ఎదుగుదల, దుబ్బు శాతం వృద్ధికి దోహదపడుతుందని చెబుతున్నారు.

కమ్మేసిన ముసురు! 1
1/2

కమ్మేసిన ముసురు!

కమ్మేసిన ముసురు! 2
2/2

కమ్మేసిన ముసురు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement