
ఎరువుల షాపుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
కోడూరు: మండలంలోని ఎరువులు, పురుగు మందుల షాపుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 49టన్నుల ఎరువులను సీజ్ చేశారు. ఏడీఏ జయప్రద పర్యవేక్షణలో అవనిగడ్డ సీఐ యువకుమార్, తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, ఏఓ శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ టీంగా ఏర్పడి మండలంలోని అన్ని షాపుల్లో తనిఖీలు జరిపారు. ఎరువుల డీలర్ల లైసెన్స్‌లు, ఓ ఫారంతో పాటు మందు కొనుగోలుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రికార్డులో నమోదు చేసిన వివరాలను పరిశీలించడంతో పాటు దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వను కూడా తనిఖీ చేశారు. రూ.17.88లక్షల విలువైన 49 టన్నుల ఎరువులకు వ్యాపారులు ఓ ఫారం చూపించలేకపోయారు. దీంతో ఈ ఎరువులను సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ టీం తెలిపింది. సీజ్ చేసిన ఎరువులకు ఓ ఫారాన్ని వ్యాపారులు రెండు రోజుల్లో చూపించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలతో పలువురు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు.
రూ.17.88లక్షల విలువైన
49టన్నుల ఎరువులు సీజ్