
రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో..
ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి. పాండురంగారావు మాట్లాడుతూ రజకుల కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల నిధులను కేటాయించాలన్నారు. 50ఏళ్లు నిండిన ప్రతి రజకునికి రూ. 5వేలు పింఛన్ మంజూరు చేయాలన్నారు. రజకులకు ఎస్సీ, ఎస్టీ తరహాలో సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు. జీవో నంబర్ 6 ప్రకారం రజక వెల్ఫేర్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన మూడు నెలలకు ఒకసారి ఏర్పాటు చేసి, తమ సమస్యలను చర్చించి, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ నాయకులు ఎ. రజనీకాంత్, కె. నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.