
ఫీజు బకాయిలపై ధర్నా..
జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు బకాయిలు ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎయిడెడ్ కళాశాలలకు నిధులు కేటాయించి ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్. సమరం, విద్యార్థులు పాల్గొన్నారు.