
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాల
గుడివాడరూరల్: తమ అభిమాన నటుడిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) అభిమానులు డిమాండ్ చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద నందమూరి తారక రామారావు విగ్రహం సమీపంలో ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. తొలుత దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకులు తేజమాణిక్యం, సుధీర్, సురేంద్ర మాట్లాడుతూ.. తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌ను, ఆమె తల్లిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దూషించి విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే దగ్గుపాటి ఎన్టీఆర్, ఆమె తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫొటోలతో కూడిన బ్యానర్లను అభిమానులు దహనం చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు హరి, బండి కోటిబాబు, పృఽధ్వీ, కార్తీక్, నవీన్ వంశీ, రవి, మన్నేం వంశి, కాజా రవితేజ పాల్గొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల డిమాండ్