వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

Jun 4 2025 1:27 AM | Updated on Jun 4 2025 1:27 AM

వెన్న

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

బుధవారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2025
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి అరాచకాలతో సాగింది. ఎటు చూసినా మోసం.. కుడి ఎడమల దగా అన్నట్లుగా పాలకుల తీరు నడిచింది. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ పథకాలతో ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఏ విద్యార్థి కనిపించినా తల్లికి వందనం కింద...‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’ అంటూ వేలు పెట్టి మరీ చూపించి ఆశలు రేపారు. ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైన తీరు, ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఎండగడుతూ వైఎస్సార్‌ సీపీ బుధవారాన్ని ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించి.. నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. సిగ్గులేని ప్రభుత్వాన్ని నిగ్గదీసి కడిగేసేందుకు సమాయత్తమైంది.

–8లోu

చిలకలపూడి(మచిలీపట్నం)/అవనిగడ్డ:జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక దోపిడీకి కూటమి నాయకులు తెరలేపారు. దీంతో పాటు మట్టి తవ్వకాలపై దృష్టి సారించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ వనరులను అక్రమంగా విక్రయిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. మరో పక్క జిల్లాలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. మద్యం దుకాణాల ఏర్పాటులో కూటమి నాయకులకు పెట్టుబడులు లేకుండా వాటాలు తీసుకోవటం.. ఊరూరా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేయించి అడ్డగోలుగా దోచుకుంటున్నారు.

హామీలపై గాలి మాటలు..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు తేవటంతో పాటు నిధులు కేటాయించి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన బందరు పోర్టు నిర్మాణాన్ని కూడా వారి ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2026 నాటికి పోర్టు పనులు మేమే పూర్తి చేస్తామని చెబుతుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. దీంతో పాటు మచిలీపట్నం నగరంలోని డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పిన నాయకులు నేడు ఆ హామీని మరచి సంబరాలు చేసుకునేందుకే ప్రాధాన్యత నిస్తున్నారు. మసులా బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో దోచుకునేందుకు తెరలేపారు.

22ఏ నిషేధిత భూముల సమస్య

మళ్ల్లీ మొదటికి..

గతంలో ఆనాటి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు చొరవతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరించిన 22ఏ నిషేధిత భూముల సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. గతంలో చంద్రబాబు హయాంలో తలెత్తిన ఈ సమస్యను జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరించగా, అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లా చుక్కెట్టారు. దీంతో అవనిగడ్డ నియోజకవర్గంలో 17వేల మంది రైతు కుటుంబాలు చేతిలో లక్షల ఖరీదు చేసే పొలాలున్నా అవసరాలకు అక్కరకు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పంటను దున్నేస్తున్నా పట్టించుకోలేదు..

గతంలో ఎన్నడూ లేనివిధంగా మోపిదేవి మండలంలోని పలు ప్రాంతాల్లో పండించిన పంటను కొనే నాథుడు లేక క్యాబేజీ పంటను రైతులు దున్నేశారు. బజ్జీ మిర్చి, టమాటాను కోసి రహదారుల పక్కన పారబోశారు. గత ఖరీఫ్‌లో పండించిన ధాన్యంను కొనే దిక్కులేక రహదారుల వెంట రోజుల తరబడి పడిగాపులు పడ్డారు. మంత్రి నాదెళ్ళ మనోహర్‌ హామీ ఇచ్చినా లంకపల్లిలో నెలరోజులకు ధాన్యం కొనుగోలు చేయక కొంతమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎదురుమొండి వారధి ఊసేలేదు..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఈ వారఽధి కోసం రూ.108 కోట్లు నాబార్డు నిధులు మంజూరవ్వగా అప్పటికే పార్టీ మారే ఉద్దేశం ఉన్న బాలశౌరి ఎక్కడ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబుకు పేరొస్తుందని దానిని అడ్డుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎదురుమొండి వారధి నిర్మాణం వెంటనే చేపడతామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకూ ఈ వారధి ఊసే ఎత్తకపోవడం పట్ల దీవుల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే గత ఏడాది వచ్చిన వరదలకు నాలుగు సార్లు ఎడ్లంక కాజ్‌వే రహదారి కొట్టుకుపోయినా పట్టించుకున్న పాపాన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

సూపర్‌సిక్స్‌ అంటూ అరచేతిలో వైకుంఠం

ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని కూటమి ప్రభుత్వం ఓటు వేసిన ప్రజానీకానికి వెన్నుపోటు కూటమి మోసాలను ఎండగడుతూ నేడు వైఎస్సార్‌సీపీ నిరసన జిల్లా వ్యాప్తంగా ప్రజా భాగస్వామ్యంతో నిర్వహణకు ఏర్పాట్లు

ఎడతెగని వంచన

ఏడాది పాలన..

పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) పర్యవేక్షణలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వ నయవంచన పాలనపై వినతి పత్రాలు అందజేయనున్నారు.

జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పార్టీ కన్వీనర్‌ పేర్నికిట్టు నేతృత్వంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు.

పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన పట్టణంలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ ఉప్పాల రాము ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వరకూ తరలి వెళ్లనున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన అవనిగడ్డ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌ నేతృత్వంలో ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు.

గుడివాడ నియోజకవర్గ పరిధిలో గడివాడ పట్టణంలోని ఎన్జీవో హోం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ సీనియర్‌ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌ నేతృత్వంలో ఆర్డీఓ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు.

గన్నవరం నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు.

పామర్రు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ కన్వీనర్‌ కై లే అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయానికి తరలివెళ్లనున్నారు.

పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడులో కల్యాణ మండపం నుంచి పార్టీ కన్వీనర్‌ దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని అందజేయనున్నారు.

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. 1
1/6

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. 2
2/6

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. 3
3/6

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. 4
4/6

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. 5
5/6

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం.. 6
6/6

వెన్నుపోటుపై ప్రశ్నిద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement