సుబ్బారాయుడి సేవలో.. | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడి సేవలో..

Dec 23 2025 8:13 AM | Updated on Dec 23 2025 8:13 AM

సుబ్బ

సుబ్బారాయుడి సేవలో..

సుబ్బారాయుడి సేవలో.. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ‘ముస్తాబు’ త్రో బాల్‌ విజేతగా ఉయ్యూరు డివిజన్‌ కృష్ణా నదిలో గుర్తు తెలియని మృతదేహం

మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ గురుకులాల సెక్రటరీ పి. మాధవీలత, రాష్ట్ర గౌడ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, నూతనంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వీరంకి వెంకట గురుమూర్తి విడివిడిగా సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్‌ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.

మచిలీపట్నంఅర్బన్‌: ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ‘ముస్తాబు’ కార్యక్రమానికి సంబంధించి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబు కార్యక్రమం నిర్వహణతో విద్యార్థులు ఆరోగ్యం, ఆహ్లాదం, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా చేసుకునే లక్ష్యంతో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అన్ని విద్యాసంస్థల్లో సమగ్రంగా అమలు చేయాలన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.ఫణి ధూర్జటి, డీఆర్‌ఓ చంద్రశేఖర్‌ రావు, డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

గూడూరు: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు నిర్వహించిన త్రో బాల్‌ జిల్లా స్థాయి పోటీలలో ఉయ్యూరు డివిజన్‌ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం గూడూరు హైస్కూల్లో నిర్వహించిన పోటీలలో ఫైనల్‌లో మచిలీపట్నం డివిజన్‌ జట్టును చిత్తు చేసి ఉయ్యూరు డివిజన్‌ జట్టు విజేతగా నిలిచింది.

క్రికెట్‌ చాంపియన్‌గా మచిలీపట్నం..

పురుషుల క్రికెట్‌ విభాగంలో జిల్లా విజేతగా మచిలీపట్నం డివిజన్‌, రన్నర్‌గా ఉయ్యూరు డివిజన్‌ జట్లు నిలిచాయి. వీరిలో నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపనున్నట్లు జిల్లా స్పోర్ట్స్‌ సెక్రటరీ మత్తి అరుణ తెలిపారు. ఉదయం త్రోబాల్‌, క్రికెట్‌ పోటీలను గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని గొరిపర్తి విజయకుమారి, లింగం విజయ్‌కుమార్‌ ప్రారంభించారు.

తాడేపల్లి రూరల్‌: సీతానగరం పుష్కర ఘాట్ల సమీపంలో రైల్వే బ్రిడ్జి కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు సోమవారం తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వారు వెళ్లి విజయవాడ నుంచి కృష్ణా కెనాల్‌కు వచ్చే రైల్వే ట్రాక్‌ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని బయటకు తీసి గుట్టుచప్పుడు కాకుండా మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఒక కన్ను పూర్తిగా పోయి లొట్టగా ఉందని తెలియవచ్చింది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 ఉండొచ్చు. ట్రైన్‌లో నుంచి జారి పడ్డాడా? గతంలో మాదిరి రైల్వేబ్రిడ్జిపై హత్యచేసి కిందకు నీళ్లలోకి పడవేశారా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రస్థాయి జూడో

పోటీల్లో ప్రతిభ

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న నాగల సౌరవ్‌ రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సత్తాచాటి రెండు రజత పతకాలు కై వసం చేసుకున్నాడు. జూడో పోటీల్లో క్యాడెట్‌, జూనియర్‌ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. సోమ వారం కళాశాలలో సౌరవ్‌ను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టి.ఆర్యాపతి, అధ్యాపకులు అభినందించారు.

సుబ్బారాయుడి సేవలో.. 1
1/2

సుబ్బారాయుడి సేవలో..

సుబ్బారాయుడి సేవలో.. 2
2/2

సుబ్బారాయుడి సేవలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement