ఉత్సాహంగా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ వెటరన్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్–2025 నగరంలోని ఫన్‌టైమ్స్ క్లబ్‌లో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. పురుషుల సింగిల్స్ 40+ కేటగిరీలో ప్రదీప్, 50+ కేటగిరీలో వైటీవీ సుబ్బారావు, 60+ కేటగిరీలో కె.జయరామ్, 65+ కేటగిరీలో సీహెచ్ హనుమంతరావు, 70+ కేటగిరీలో గంగాధర్, 75+ కేటగిరీలో ఎస్.ప్రభాకరరావు, పురుషుల డబుల్స్ 40+ కేటగిరీలో వైవీ ప్రదీప్, బి.రాజు, 50+ కేటగిరీలో నరసింహారావు, సుభాకృష్ణ, 60+ కేటగిరీలో కె.జయరామ్, అబ్బాస్, మహిళల సింగిల్స్ 40+ కేటగిరీలో పి.భారతి, 50+కేటగిరీలో సత్యవతి, 60+ కేటగిరీలో బేబీ సరోజిని, మిక్స్‌డ్ డబుల్స్‌లో సురేష్, సరోజిని విన్నర్స్‌గా నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ బహుమతులను అందజేశారు.


