పన్నుల వసూలులో తాడిగడపకు అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

పన్నుల వసూలులో తాడిగడపకు అగ్రస్థానం

Apr 9 2025 2:15 AM | Updated on Apr 9 2025 2:15 AM

పన్నుల వసూలులో తాడిగడపకు అగ్రస్థానం

పన్నుల వసూలులో తాడిగడపకు అగ్రస్థానం

పెడన: వార్డు సచివాలయాలు వచ్చిన తరువాత నగరాలు, పట్టణాల్లో పన్నులు వసూళ్లు వేగవంతమయ్యాయి. గతంలో ఏటా పన్నులు వసూళ్లు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోయేవి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థతో పన్నులు వసూళ్లలో ప్రగతి నమో దైంది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక శాఖ పరిపాలన విభాగం పన్నుల వసూళ్లు చేసిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ర్యాంకులను ప్రకటించింది. కృష్ణాజిల్లాలోని తాడిగడప పురపాలక సంఘం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు నాలుగు పురపాలక సంఘాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ కార్పొరేషన్‌తో పాటు నాలుగు పురపాలక సంఘాల్లో వసూలైన ఆస్తిపన్ను వివరా లను కూడా వెల్లడించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇలా..

ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ కార్పొరేషన్‌తో పాటు నాలుగు పురపాలక సంఘాల్లో ఆస్తి పన్నుల వసూలులో తిరువూరు జిల్లాలో అగ్రస్థానంలో నిలి చింది. 9,700 అసెస్‌మెంట్ల ద్వారా రూ.4.12 కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.3 కోట్ల వసూలు చేసి 72.80 శాతం నమోదుతో ప్రథమ స్థానం దక్కించుకుంది. జగ్గయ్యపేట 13,901 అసెస్‌మెంట్ల ద్వారా రూ.6.58 కోట్ల పన్నులకు రూ.4.35 కోట్లు వసూలు చేసి 66.14 శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. నందిగామలో 13,754 అసెస్‌మెంట్ల ద్వారా రూ.5.64 కోట్ల పన్నులకు రూ.3.62 కోట్లు వసూళ్లు చేసి 64.17 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. కొండపల్లిలో 14,609 అసెస్‌మెంట్లకు రూ.8.69 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. రూ.4.45 కోట్ల వసూళ్లు చేసి నాలుగో స్థానం దక్కించుకుంది. విజయవాడ కార్పొరేషన్‌లో 2,36,388 అసెస్‌మెంట్ల ద్వారా రూ.418.85 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. రూ.173.24 కోట్ల మేర పన్నులు వసూలు చేసి 41.36 శాతంతో చివరిలో నిలిచింది.

కృష్ణా జిల్లాలో పెడన పురపాలక సంఘానికి ద్వితీయ స్థానం ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో తిరువూరు, జగ్గయ్యపేట చివరిలో విజయవాడ, మచిలీపట్నం నగర పాలక సంస్థలు వార్డు సచివాలయాల ఏర్పాటుతో పెరిగిన పన్నుల వసూళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement