ప్రియుడుతో వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య.. | - | Sakshi
Sakshi News home page

ప్రియుడుతో వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య..

Dec 20 2023 1:48 AM | Updated on Dec 20 2023 12:43 PM

- - Sakshi

వీరులపాడు(నందిగామ): వివాహేతర సంబంధాన్ని చూసి, చేయిచేసుకున్న భర్తను ఓ మహిళ ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన వీరులపాడు గ్రామంలో జరిగింది. వీరులపాడు గ్రామానికి చెందిన యాదల శ్రీనివాసరావు (ఏలియా) (58) పాస్టర్‌గా జీవిస్తున్నాడు. ఎప్పటిలానే సోమ వారం ఉదయం వేరే గ్రామానికి వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య వాణి వేరే వ్యక్తితో ఉండటాన్ని చూసి కోపంతో ఆమైపె చేయి చేసుకున్నాడు. 

వాణి తన ప్రియుడితో కలిసి కేబుల్‌ వైర్‌తో శ్రీనివాసరావు మెడకు ఉరిబిగించింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాణి తన ప్రియుడిని అక్కడి నుంచి పంపించేసింది. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో వాణి తన భర్త చనిపోయాడని, ఎలా మృతి చెందాడో తనకు తెలియదని, తామిద్దరం వేర్వేరు గదుల్లో నిద్రించామని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులకు వాణిపై అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. 

ఏసీపీ కె.జనార్దన్‌ నాయుడు, నందిగామ రూరల్‌ సీఐ నాగేంద్ర కుమార్‌, వీరులపాడు ఎస్‌ఐ మహాలక్ష్ముడు, కంచికచర్ల ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం ఘటనాస్థలానికి చేరు కుని శ్రీనివాసరావు భౌతికకాయాన్ని పరిశీలించారు. వాణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement