
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీటీడీసీ కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత సహకార వారోత్సవాలు జరిగాయి. జిల్లా సీ్త్ర నిధి మేనేజింగ్ డైరెక్టర్ నాంచారయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిజిటల్ సాంకేతిక మెరుగు పరచడంలో సహకార సంఘాల పాత్ర, సీ్త్ర నిధి లావాదేవీలు నిర్వహించే విధానం, బయోమెట్రిక్, మొబైల్ యాప్ విధానంలో రుణాల మంజూరు, పేటీఎమ్ ద్వారా రుణాల రికవరీ అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రుణ విధానం, పేటీఎమ్ ద్వారా రుణాల రీపేమెంట్‌పై బ్రోచర్‌ను ఆవిష్కరించారు. జిల్లా సహకార అధికారి శైలజ సహకార జెండాకు వందనం చేశారు. కార్యక్రమంలో సహకార అధికారి కిరణ్‌కుమార్, కేశవ కుమారి, పేటీఎమ్ ప్రతినిధి సత్యనారాయణ, డీజీఎం సిద్ధి శ్రీనివాస్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి గ్రామ సంఘాల సహాయకులు, ప్రాజెక్ట్, సీ్త్ర నిధి సిబ్బంది పాల్గొన్నారు.