కీచక ప్రిన్సిపాల్‌.. అబార్షన్‌ అయిన యువతి ధైర్యం చేయడంతో.. | - | Sakshi
Sakshi News home page

కీచక ప్రిన్సిపాల్‌.. అబార్షన్‌ అయిన యువతి ధైర్యం చేయడంతో..

Jun 9 2023 1:12 AM | Updated on Jun 9 2023 1:02 PM

- - Sakshi

(విజయవాడపశ్చిమ): విద్యార్థిని బెదిరించి ఆమైపె పలు మార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా గర్భస్రావం చేయించిన నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అజిత పేజెండ్ల పేర్కొన్నారు. నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అరెస్టుపై గురువారం కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డీసీపీ అజిత పేజెండ్ల మాట్లాడుతూ 2017 నుంచి 2020 వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన యువతి ఫణి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కళాశాలలో జీఎం నర్సింగ్‌ కోర్సును అభ్యసించిందన్నారు.

ఆ సమయంలో ప్రిన్సిపాల్‌ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆ యువతిని భయపెట్టి, బెదిరించి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నెలసరి రాకపోవడంతో మూడు సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. దీంతో నర్సింగ్‌ చేయలేక, ఆ యువతి స్వగ్రామం వెళ్లిపోయిందని చెప్పారు.

ప్రిన్సిపాల్‌ రవీంద్రారెడ్డి మరోమారు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం తెలుసుకున్న ఆ యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు ఎన్టీఆర్‌జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె. ఆదేశాల మేరకు నిందితుడు రవీంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ కె. హనుమంతరావు, కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement