వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది కేవలం ఆదాయం సమకూర్చే ప్రక్రియ కాదు. అది ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన బాధ్యత. ప్రైవేట్ కేంద్రాలకు అనుమతులు ఇచ్చినంత మాత్రాన వాటి పనితీరుపై ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గకూడదు. ఇవి వాహన భద్రతను పెంచడానికే పనిచేయాలి తప్ప, అవి అక్రమ వసూళ్ల కోసం నిబంధనలను పక్కనపెట్టి సర్టిఫికెట్లు జారీ చేసే కేంద్రాలుగా మారకూడదు. ఇక్కడ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాలి. వాటిపై రవాణాశాఖ ఉన్నతాధికారుల అజమాయిషీ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
–బి.శేషగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యూ ఆంధ్రా మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్


