ఆసిఫాబాద్రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ మైదానంలో బుధవారం హ్యాండ్బాల్ పోటీలు పోటాపోటీగా కొనసాగాయి. సీనియర్ మహిళల విభాగంలో జిల్లా నుంచి 70 మంది పాల్గొనట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్యామ్సుందర్రావు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 16మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన ఆదర్శ క్రీడా మైదానంలో డిసెంబర్ 3వరకు వీరికి కోచింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4నుంచి 6వ తేదీ వరకు నల్గొండలో నిర్వహించనున్న 55వ సీనియర్ మహిళా హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని కోచ్ అరవింద్ పేర్కొన్నారు. డీఎస్వో షేకు, నోడల్ అధికారి మీనారెడ్డి, కోచ్ రాకేశ్, సరోజ్ తదితరులు పాల్గొన్నారు.


