ఆసిఫాబాద్రూరల్: పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డీఈవో సచ్చిదానందచారికి వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మా ట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ కోసం పని చేస్తున్న ఇన్స్ట్రక్టర్లు, ఆయాలకు ఐ దు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు ప డుతున్నారని తెలిపారు. పెండింగ్ వేతనాలు చెల్లించి, ప్రతీనెల 5లోపు వేతనాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐడీ కార్డులు, ప్రసూతి సెలవులు మంజూరు చే యాలని విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దివాకర్, చిరంజీవి పాల్గొన్నారు.


