కెరమెరి: విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందు కు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఏసీఎంవో పుర్క ఉద్దవ్ సూచించారు. బుధవారం మండలంలోని రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో పాఠ్య పుస్తకాలు చదివించారు. అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయులు బోధన విధానాలను పరిశీలించారు. వార్షిక పరీక్షల్లో పదోతరగతి విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించాలని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని పాటించాలని తెలిపారు. విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాలు చేరుకునేలా ఉపాధ్యాయులు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. హెచ్ఎంలు గోవింద్, నారాయణ ఉన్నారు.


