ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి వ్యసనాన్ని వదిలి పెట్టాలని, గతాన్ని పాఠంగా తీసుకుని భవిష్యత్తును కాపాడుకోవాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ సహకారంతో శుక్రవారం ఆసిఫాబాద్ పోలీ సు స్టేషన్‌లో గంజాయి వినియోగించే వారికి ప్రత్యే క కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి తో నేరుగా మాట్లాడి గంజాయి వినియోగానికి కారణాలు, కుటుంబ నేపథ్యం, ప్రస్తుత జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పోషణ బాధ్యతలు తదితర వివరాలను తెలుసుకున్నారు. డీఎస్పీ అశోక్ గంజాయి వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంపై పడే ప్రతికూల ప్ర భావాలు, కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, ఆర్థి క నష్టాలను వివరించారు. కాగజ్‌నగర్, ఈస్‌గాం ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతా లు, చంద్రాపూర్, రాజూరా తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉ న్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వ్యసనానికి అలవాటుపడిన వ్యక్తులు స్వచ్ఛందంగా గంజాయిని విడిచిపెట్టాలన్నారు. కు టుంబ సభ్యులు కూడా వారికి అండగా నిలిచి, సా ధారణ జీవనంలోకి తిరిగి వచ్చేలా సహకరించాలని కోరారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ‘సే నో టు డ్రగ్స్– సే ఎస్ టు లైఫ్’ అనే సందేశాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నీలం రవి, సిబ్బంది పాల్గొన్నారు.


