కాగజ్‌నగర్‌టౌన్: కళ్లు మూసినా ప్రపంచాన్ని చూడొచ్చని నిరూపిస్తున్నారు కాగజ్‌నగర్‌లోని ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ విద్యార్థులు. పాఠశాలలో గత ఆగస్టు 12 నుంచి 12 రోజుల పా టు థర్డ్ ఐ యాక్టివిటీపై ప్రత్యేక శిక్షణ జరిగింది. క ర్ణాటక నుంచి ప్రత్యేక నిపుణులు ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతో వారికి కళ్లకు గంతలు కట్టుకుని వస్తువు వాసన బట్టి వస్తువు పేరు, కలర్ చెప్పడం. చేతితో తాకి రంగులను అంకెలు, కళ్లు మూసుకుని పేర్లను మనుషులను గుర్తించడం, పుస్తకాలు చదవడం వంటి అంశాలపై శిక్షణ అందజేశారు. మొదట్లో భయపడిన విద్యార్థులు 12 రోజుల్లో అద్భుతాలు చేసి చూపించారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్న ఈఎంఆర్ఎస్ విద్యార్థులు ఇప్పుడు థర్డ్ ఐ యాక్టివిటీలోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. వీరి ప్రతిభ చూసి జిల్లావ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.


