నేడే ధంతేరస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే ధంతేరస్‌

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

● మూడురోజుల వేడుకలకు సిద్ధమవుతున్న మార్వాడీలు ● శనివారం నరక చతుర్థశి.. ఆదివారం దీపావళి

చెన్నూర్‌: దీపావళి వేడుకలను మూడురోజులు ఘనంగా నిర్వహించేందుకు మార్వాడీలు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ధంతేరస్‌ (ధన త్రయోదశి) రోజున బంగారం, వెండి నగలు, కొత్త వాహనాలు కొనుగోలు చేయడంతో అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. సాయంత్రం లక్ష్మీ, కుబేరుని పూజలు నిర్వహించి 13 దీపాలు వెలిగిస్తారు. దేవుని వద్ద రెండు, తులసి వద్ద ఒకటి, వ్యాపారసంస్థల ఎదుట పది దీపాలు ఏర్పాటు చేస్తారు. లక్ష్మీ, కుబేరుల ప్రార్థించడం వారికి ఆనాదిగా వస్తున్న ఆచారం. శనివారం నరక చతుర్ధశిని చిన్న దీపావళి పండుగ నిర్వహిస్తారు. సాయంత్రం వేళలో పూజలు చేసి 14 దీపాలు వెలిగిస్తారు. పూజ గదిలో కొన్ని, ఇళ్ల ముంగిట్లో పది దీపాలు ఏర్పాటు చేస్తారు. ఆదివారం అమావాస్య రోజున దీపావళి, లక్ష్మీ పూజలు, ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తారు. బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలతో జరుపుకొంటారు. లక్ష్మీ కటాక్షం కలగాలని రాత్రి జాగరణ ఉండడం అనవాయితీగా వస్తోం.

సోమవారం నోము

దీపావళి అనంతరం సోమవారం మధ్యాహ్నం వర కు అమావాస్య ఉండడంతో సాయంత్రం నోము చేసుకుంటారు. బ్రాహ్మణులు ఉదయం నోము పూజలు నిర్వహిస్తారని వేదపండితులు తెలిపారు. మంగళవారం గోవర్థన పూజ ఆవుపేడతో వాకిలి చల్లి తులసిచెట్టు వద్ద గోవర్థన పూజ చేస్తారు. అనంతరం బాయ్‌దూజ్‌ అంటే అక్కాచెల్లెళ్లు, అన్నలకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement