పెంచికల్పేట్: గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా త యారీ, అమ్మకాలపై ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురి తమైన ‘గుడుంబా మత్తులో పల్లెలు’ అనే కథనానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించారు. పెంచికల్పేట్ మండలం దరోగపల్లి గ్రామంలోని నాటుసారా స్థావరాలపై గురువారం దాడి చేశారు. పత్తి చేలలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల బెల్లం పానకం, ప్లాస్టిక్ డ్రమ్ములను ధ్వంసం చేశారు. గుడుంబా విక్రయిస్తున్నారనే అనుమానంతో పలువురి ఇళ్లలో సోదాలు చేశారు. గ్రామంలో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్సైలు మాన్సింగ్, సందీప్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


