క్రీడల్లో ‘ఈఎంఆర్‌ఎస్‌’ సత్తా..! | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో ‘ఈఎంఆర్‌ఎస్‌’ సత్తా..!

Nov 6 2026 1:26 AM | Updated on Nov 6 2026 1:26 AM

● ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు ● జాతీయస్థాయికి ఎంపిక

కాగజ్‌నగర్‌టౌన్‌: చదువు మాత్రమే కాకుండా క్రీడలు కూడా భవిష్యత్తుకు బాటలు వేస్తాయని నిరూపిస్తున్నారు కాగజ్‌నగర్‌ ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(ఈఎంఆర్‌ఎస్‌) విద్యార్థులు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. పాఠశాలలో కోచ్‌లు, ఉపాధ్యాయలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అక్టోబర్‌ 29 నుంచి 31 వరకు మేడ్చల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈఎంఆర్‌ఎస్‌ విద్యార్థులు సత్తా చాటారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను ప్రిన్సిపాల్‌ రమేశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు. క్రీడాపోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు తమ అనుభవాలు, భవిష్యత్తు లక్ష్యాలు గురించి ‘సాక్షి’కి వివరించారు..

విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం

ఏకలవ్య మోడల్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో ప్రొత్సహిస్తున్నాం. క్రీడలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. సాయంత్రం గ్రౌండ్‌లో సాధన చేయిస్తున్నాం. క్రీడాకారుల విజయం వెనక కోచ్‌ కష్టం ఉంది.

– రమేశ్‌, ప్రిన్సిపాల్‌, ఈఎంఆర్‌ఎస్‌, కాగజ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement